
కేవలం 47 లక్షల మంది రైతులకే అన్నదాత “సుఖీభవ “
News Velugu Amaravathi : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమిలపై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు . బాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. ఇచ్చేది గోరంత చెప్పేది కొండంత అన్నట్టు సిఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క సారి ప్రజలకు మాటిస్తే అది శాసనం లా ఉండాలన్నారు. ఎన్నికలకు ముందు బాబు బాగానే ప్రజలను మబ్యా పెట్టారన్నారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే.. కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మంది రైతులనే నని వారు అన్నారు. వడపోతల పేరుతో 30 లక్షల మంది రైతులకు సిఎం టోకరా పెట్టారన్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సగం మందికే ఇస్తూ, తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు కోత పెట్టిన గనుడని ఎద్దవా చేశారు . ఇప్పుడు సుఖీభవ పేరుతో సగం మంది రైతులకు బాబు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20వేలు ఇస్తుందని ఎన్నికల ప్రచారంలో బాబు గారు ఊదరగొట్టారు. తీరా గెలిచాక కేంద్రం ఇచ్చే రూ. 6వేలతో ముడిపెట్టి నాలుక మడతేశారు. కేంద్రం ఇచ్చే రూ.6వేలు పక్కన పెడితే రాష్ట్ర నిధుల నుంచి మీరిచ్చేది కేవలం రైతుకి రూ.14వేలే. ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధం అని మాటల తూటాలు పేల్చారు. కేంద్రం నేరుగా రైతుల అకౌంట్ లో వేస్తున్నప్పుడు మీరెలా ఇచ్చినట్లు చెప్పుకుంటారు అన్నారు? రెండు కలిసే సమస్యే లేదన్నారు. ఇన్ని మాటలు చె