సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి

సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి

ప్యాపిలి, న్యూస్ వెలుగు;  ప్యాపిలి పట్టణంలోని నాగుల కట్టమీద సిపిఐ పార్టీ శాఖ 1 సమావేశం జింకల పెద్దన్న అధ్యక్ష నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం ముఖ్య అతిథిలుగా CPI జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ,AISF జిల్లా అధ్యక్షులు సూర్య ప్రతాప్ మండల కార్యదర్శి వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతు కొత్తగా ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డూ చుట్టూ తిరుగుతూ ప్రజలకు అందించే పాలన మరిచింది అని వారు మండిపడ్డారు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం లోని ప్రజా సేవ కాకుండా రాష్ట్రం లోని మతాల మధ్య చిచ్చు పెడుతూ హిందువులు అందరూ రోడ్ల మీదకి రావాలిని అని తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలసింది పోయి రెచ్చగొడుతూ వాక్యాలు చేస్తున్నాడు అని అసలు హిందువులు ఎందుకు రావాలి ఎవరి మీద పోరాటం చెయ్యాలి అధికారం ఉన్న మీ కూటమి ప్రభుత్వము పైనన లేక పోతే రాష్ట్రని అని విధాలుగా 10 సంవత్సరాలుగా మోసం చేస్తున్నప్పటికీ సిగ్గు లేకుండా మద్దతు ఇచ్చి అధికారం రావడానికి కారణమైన అయిన్నందుక అనేది అర్థం కావడం లేదు అని పనికిమాలిన మాటలు మానుకొని ప్రజలకు అందించావలసినవి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు,విద్యా, వైద్యం అందించాలని కోరుతూ మీ కూటమి ప్రభుత్వం అధికారం లో ఉంది అని ప్రతిపక్షం కాదు అని ఆ కూటమి ప్రభుత్వానికి వారు గుర్తు చేశారు, రాష్ట్రం లో ఒక వైపు వర్షాలకు అధికంగా పడి రైతులు నష్టపోతున్నారు వారి ఆదుకొని పంట పరిహార నష్టం అందించాలని వారు అన్నారు, ప్యాపిలి మండలం లో అధికంగా టమోటా మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటారు అని గత ప్రభుత్వం టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కేవలం భూమి పూజలకే పరిమితం అయిందని కావున దాన్ని పూర్తి చెయ్యాలని వారు డిమాండ్ చేశారు, ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే పెద్ద మండలం ప్యాపిలి అని అలాంటి మండలం లో అగ్నిమాపక కార్యలయం లేక పోవడం సిగ్గు చేటు అని ఏది అయిన అనుకోకుండా ప్రమాదం జరిగేతే అగ్ని మాపక వాహనం వచ్చే లోపు జరిగే నష్టం జరుగుతుంది అని కావున ఒక అగ్ని మాపక కేంద్రం ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు, ప్యాపిలి మండలం లోని చెరువులను నింపేది ఒక కలగా మిగిలిపోతుంది అని ఈ ప్రభుత్వం అయిన ఈ మండలం లోని రైతులను దృష్టిలో పెట్టుకొని అని చెరువులను నింపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని, లేకపోతే గత ప్రభుత్వనికి పట్టిన గతి మీ కూటమి ప్రభుత్వనికి కూడా వచ్చే విధంగా మండలంలోని ప్రజలకు కలుపుకొని ఉద్యమాలను చేపడుతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో లో CPI పట్టణ కార్యదర్శి పికిలి వెంకటేష్, హమాలీ యూనియన్ నాయకులు శ్రీనివాసులు,రాము, భాస్కర్,రవి తదతరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!