
సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కు మంచి బుద్ది ప్రసాదించాలని నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన తెలియజేసి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన డోన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి
డిఎస్సి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి
రాష్ట్రములో సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి
డోన్, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షులు జె. లక్ష్మి నరసింహ ఆదేశాల మేరకు బుధవారం డోన్ పట్టణములో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన తెలియ చేయడం జరిగింది ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ మరియు దాని మిత్రపక్షాలైన టిడిపి, జనసేన నాయకులకు మంచి బుద్ది ప్రసాదించాలని, దేవుని పేరుతో మత, కుల రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను పక్కన పెట్టి మోసం చేస్తున్న నాయకులకు జ్ఞానోదయం కలిగించాలని డోన్ నియోజకవర్గానికి ఏం ఎల్ ఏ గా పోటీ చేసిన అభ్యర్థి &న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి ఆధ్వర్యములో మహాత్మ గాంధీ విగ్రహానికి ఒక వినతి పత్రం అందించడం జరిగింది.దేశంలో, రాష్ట్రములో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయి, నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉన్నాయని, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలనీ, కాలిగా ఉన్న ఎస్సి ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలనీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు యు. జనార్దన్, డోన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వై. శేఖర్, డోన్ పట్టణ అధ్యక్షులు ఆర్ గోపినాథ్, ప్యాపీలి మండల అధ్యక్షులు ఎస్ మహేంద్ర నాయుడు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు టి. విజయకుమార్,యూత్ కాంగ్రెస్ నాయకులు హనుమాన్, నాయకులు రామకృష్ణ,భాస్కర్,బజారి,ఆచారి,ఎన్ ఎస్ యు ఐ నాయకులు మాబు, కలందర్,మస్తాన్, మధు,అభిషువా తదితరులు పాల్గొన్నారు
*