పత్తికొండ : రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తేందే తప్ప రైతు సంక్షేమానికి ఎలాంటి మేలు చేయలేదని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జొన్నగిరిలో పర్యటించారు.

అప్పుల బాధతో ఆత్మహత్యచేసుకున్న తిమ్మన్న కుమారుడు గుంత హనుమన్న కుటుంబాన్ని పరామర్శించినట్లు రైతు సంఘం నాయకులూ కొండారెడ్డి , తుగ్గలి మండల కార్యదరిశి తిమ్మన్న , సిపిఎం నాయకులూ శ్రీరాములు గుంత హనుమన్న ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగితెలుసుకున్నారు . ఏళ్ల తరబడి అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న సరైన దిగుబడి రాక , బ్యాంకుల రుణాలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని కుటుంబసభ్యులు వాపోయారు . ప్రభుత్వం బాధిత కుటంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . కార్యక్రమంలో పార్టీ నాయకులూ , కార్యకర్తలు పాల్గొన్నట్లు తెలిపారు.
Thanks for your feedback!