కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ గా  సూర్య ప్రకాశ్ రెడ్డి

కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ గా సూర్య ప్రకాశ్ రెడ్డి

న్యూస్ వెలుగు (కర్నూలు ): కర్నూలు జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ గా సూర్య ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు ని   విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో నియామక పత్రం అందజేశారు. అనంతరం సూర్య ప్రకాష్ రెడ్డి  మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ గా నియమించిన జాతీయ కాంగ్రెస్ యువ నాయకులు రాహుల్ గాంధీ కి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారికి, జాతీయ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సుఖ పాల్ సింగ్ ఖైరా గారికి, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఏపీ ఇన్చార్జి నీలం రమేష్ కి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకర్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లాలో కిసాన్ కాంగ్రెస్ ను బలోపేతం చేసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వంతో పోరాడతామని సూర్యప్రకాశ్ రెడ్డి  తెలియజేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రివర్యులు కనుమూరి బాపిరాజు , రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి , కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కే రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!