
క్రీడా కోటాను సద్వినియోగం చేసుకోండి ; డి ఎస్ డి ఓ
న్యూస్ వెలుగు, కర్నూల్; హాకీ క్రీడాకారులు, చదువుతోపాటు క్రీడల్లో పాల్గొని, క్రీడా కోటా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మూడు శాతం, రిజర్వేషన్లు ,ఉపయోగించుకొని, ఉద్యోగ అవకాశాలు చేసుకోవాలని, ఎంపిక పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన,,కర్నూల్ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి, భూపతి రావు తెలియజేశారు. కర్నూల్ స్టేడియంలో ఈరోజు హాకీ అసోసియేషన్ ,వారు, నిర్వహించిన ,సబ్ జూనియర్ , బాల్ర ,బాలికల,ఎంపిక పోటీల్లో పాల్గొని మాట్లాడారు. హాకీలో కర్నూలు జిల్లాకు మంచి పేరు ఉందని, రాష్ట్ర స్థాయి పోటీలలో, ప్రతిభ కనబరిచి, పథకాలతో రావాలని, హాకీ అసోసియేషన్ వారికి, తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. జిల్లా కార్యదర్శి దాసరి సుధీర్ మాట్లాడుతూ ఈనెల 17 నుంచి 19 వరకు అన్నమయ్య జిల్లా మదనపల్లి లో జరిగే ,హాకీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సెలక్షన్ మెంబర్లు, డి ప్రవీణ్, అరుణ్ రవికుమార్, మనోహర్, సీనియర్ క్రీడాకారులు, ప్రతాప్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar