ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం  సద్వినియోగం చేసుకోవాలి 

ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం  సద్వినియోగం చేసుకోవాలి 

జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య

కర్నూలు, న్యూస్ వెలుగు: రైస్ కార్డ్ కలిగి అర్హత ఉన్న వారందరూ దీపం పథకం-2 (ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం) ను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో దీపం పథకం-2 (ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం) కార్యక్రమం పై జాయింట్ కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ఒకటో తారీకు నుండి దీపం పథకం-2 (ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం) కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని ఈ పథకాన్ని అర్హత కలిగిన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో కూడా దీపం పథకం అమల్లో ఉండేది అందుకొరకే ఇప్పుడు ఈ పథకానికి దీపం-2 అని అనడం జరుగుతుందన్నారు. పథకానికి సిక్స్ స్టెప్స్ వాల్యుయేషన్ ఉందని అనగా ల్యాండ్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, ఇన్కమ్ టాక్స్, ఇంటి పన్ను, తదితర వాటిని పరిగణములోకి తీసుకొని ఆ తర్వాత అర్హత నిర్ణయించడం జరుగుతుందన్నారు. గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ కనెక్షన్ కు రైస్ కార్డును, ఆధార్ కార్డును, అనుసంధానం చేసుకోవాలన్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఈ కేవైసీ కచ్చితంగా చేసుకోవాలని అన్నారు. 1967 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎవరు అర్హత కలిగి ఉన్నారు, ఎవరికి అర్హత లేదు అన్న విషయాలను ఈ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. మార్చి నెల 31 వ తారీకు వరకు సిలిండర్ బుక్ చేసుకోవచ్చన్నారు. సిలిండర్ ఖాళీ కాకముందే బుక్ చేసుకుంటే ఖాళీ సిలిండర్ ఇవ్వనిదే కొత్త సిలిండర్ ఇవ్వడం జరగదని అందుకొరకే ఖాళీ సిలిండర్ ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలని తెలియజేశారు. సిలిండర్ బుకింగ్ ఎప్పటి లాగానే ఆన్లైన్ ద్వారా గాని, నేరుగా ఏజెన్సీ వారి ద్వారా గాని బుక్ చేసుకోవచ్చు అన్నారు. వినియోగదారుల డాటా ప్రభుత్వం వద్దనే ఉంటుంది, అర్హత ఉన్న వారికి ఈ పథకం కచ్చితంగా వర్తిస్తుందని అన్నారు. సిలిండర్ డెలివరీ టైమ్ లో అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది, తరువాత వారి ఆధార్ లింక్ కలిగిన బ్యాంకు ఖాతాలో 24 గంటల నుండి 48 గంటలలోపు అమౌంట్ జమ అవుతుందన్నారు. మన జిల్లాలో ఇప్పటివరకు 4,72,851 మంది అర్హత కలిగిన వారు ఉన్నారని. ఇందులో ఈకేవైసీ చేసుకొని వారు సాంకేతిక లోపంతో ఇబ్బంది ఉన్నవారు, ఈ కేవైసీ చేయించుకుంటే వెంటనే ఎలిజబుల్ లిస్టులో వారి పేరు నమోదు అవుతుందన్నారు. ఈ పథకం అమలు చేసి టైం అయిపోయిందని ఎవరు అనుకోవద్దు అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు HPCL లో 19518 సిలిండర్లు బుక్ చేసుకోగా 11589 సిలిండర్లు డెలివరీ జరిగినవి, IOCL లో 25024 సిలిండర్లు బుక్ చేసుకోగా 4647 సిలిండర్లు డెలివరీ అయినవి, BPCL లో32811 సిలిండర్లు బుక్ చేసుకోగా 16323 సిలిండర్లు డెలివరీ అయినవి, మొత్తంగా తీసుకుంటే 77353 సిలిండర్లు బుక్ చేసుకోగా ఇప్పటికీ 32559 సిలిండర్లు డెలివరి కాబడినవి అని జాయింట్ కలెక్టర్ అన్నారు. లబ్ధిదారులు సిలిండర్ లను ఇంటిలో వంటలకే వినియోగించుకోవాలని, అలా కాకుండా కమర్షియల్ గా వినియోగించుకున్నట్లయితే వారిపై చర్య తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!