
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
తుగ్గలి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తుగ్గలి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలియజేశారు.బుదవారం రోజున వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తిగల రైతులు రబీలో సాగుచేసిన పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుకోవాలని ఆయన తెలియజేశారు.ఇందులో పప్పు శనగ పంటకు ఎకరాకు 420 రూపాయలు,వరి పంటకు ఎకరాకు 630 రూపాయలు,జొన్న పంటకు ఎకరాకు 297 రూపాయలు,వేరుశనగకు ఎకరాకు 480 రూపాయలు,ఉల్లి పంటకు ఎకరాకు 1350 రూపాయలు,టమోటా పంటకు ఎకరాకు 1500 రూపాయలు ప్రీమియం డిసెంబర్ 15 లోపు చెల్లించాలని,వరి పంటకు డిసెంబర్ 31 లోపు చెల్లించాలని ఆయన తెలియజేశారు.ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో పప్పు శనగ,వరి,జొన్న వేరుశనగ,ఉల్లి పంటలు వస్తాయని, వాతావరణ బీమా కింద టమోటా పంటలు వస్తాయని తుగ్గలి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలియజేశారు.ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు.