
నేడు బొల్లవరంలో టిడిపి 44 ఏళ్ల వసంతాల జెండా ఆవిష్కరణ
జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్లూరు టిడిపి మండల అధ్యక్షుడు డి . రామాంజనేయులు ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డ్ డైరెక్టర్
కల్లూరు, న్యూస్ వెలుగు : తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే లక్ష్యంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేటికి 44 సంవత్సరాల ప్రస్థానాన్ని 29-03-2026 ఆదివారంతో విజయవంతంగా పూర్తి చేసుకుంటుందని బొల్లవరం గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆదివారం 29- 3- 2026 ఉదయం 10 గంటలకు గ్రామ సచివాలయం పక్కన ఉన్న టిడిపి జెండా దిమ్మె దగ్గర పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్లూరు టిడిపి మండల అధ్యక్షుడు, డి. రామాంజనేయులు ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డ్ డైరెక్టర్ సమక్షంలో జండావిష్కరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా గ్రామ టీడీపీ అధ్యక్షుడు బి.వి.జి మస్తాన్ నాయుడు తెలిపారు. 1982లో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) స్థాపించిన ఈ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ, స్వీయ గౌరవం అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రజల ముందుకు వచ్చారు. తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందిన టీడీపీ, 1983లో జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. రూ.2 కిలో బియ్యం పథకం, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధి వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయి.
1995 లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం చేపట్టిన తర్వాత పార్టీకి నూతన దిశ లభించింది. ఐటీ రంగ అభివృద్ధి, హైదరాబాద్‌ను సైబర్ నగరంగా తీర్చిదిద్దడం, ఈ-గవర్నెన్స్ ప్రవేశపెట్టడం వంటి సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.

