
దేవాలయానికి భూమి పూజ చేసిన టిడిపి ఇన్చార్జి భూపేశ్ రెడ్డి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు నియోజకవర్గం మోరగుడి గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి దేవాలయం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు జమ్మలమడుగు టిడిపి ఇన్చార్జి భూపేష్ సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దేవాలయానికి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ చౌడేశ్వరి దేవి ఆశీస్సులు జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ,మోరగుడి గ్రామ ప్రజలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!