ఎల్లార్తి షేక్షవలి,షాషావలి దర్గాను దర్శించుకున్న టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ

ఎల్లార్తి షేక్షవలి,షాషావలి దర్గాను దర్శించుకున్న టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో ఎల్లార్తి హజరత్ శేక్షవలి, షాషావలి 362వ ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఆలూరు తాలూకా టిడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్ తాతలను దర్శించుకున్నారు.ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి ఘన స్వాగతం పలికారు.

అనంతరం దర్గాలో ప్రత్యేక ఫాతెహల్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంచార్జీ వీరభద్ర గౌడను దర్గా పీఠాధిపతి నూర్ బాబా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయితీ మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ,దర్గా వర్క్ ఇన్స్పెక్టర్ సోహెల్,దర్గా ఈఓ ఇమ్రాన్,కూటమి పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!