ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసిన టిడిపి నాయకులు

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసిన టిడిపి నాయకులు

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు;  మండలంలోని  సంత జూటూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం ప్రతిష్ట ఏర్పాటుకు బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేయాలన్న తమ కోరిక నెరవేరబోతుందన్నారు. వెలుగోడు రిజర్వాయర్ ఏర్పాటుచేసి రైతాంగాన్ని సస్యశ్యామలం చేశారని అన్నారు. అలాంటి గొప్ప నాయకుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాగేంద్ర రెడ్డి బైరెడ్డి, లాయర్ కృష్ణారెడ్డి, మహేష్ రెడ్డి,సర్పంచ్ యలగల రామచంద్రుడు, మోక్షేశ్వర్ రెడ్డి  పక్కిరెడ్డి, బాలయ్య మాజీ సర్పంచ్ సత్యరాజు యలగల తిరుపాలు నాగిరెడ్డి జగదీశ్వర గౌడ్ చాంద్ భాషా టిడిపి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!