సంత జూటూరు గ్రామంలో టిడిపి సభ్యత నమోదు కార్యక్రమం
గ్రామంలో ప్రజల స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వ నమోదు.
100 రూ పార్టీ సభ్యత్వంతో ఐదు లక్షల ప్రమాద బీమా.
గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి:- టిడిపి నాయకుడు లాయర్ కృష్ణారెడ్డి.
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: మండలంలోని సంత జుటూరు గ్రామంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుడు లాయర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4000 పెంపు అదేవిధంగా మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ లు తోపాటు సూపర్ సిక్స్ పథకాలను అమలు పరచడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితులైన గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరుగుతుందన్నారు వంద రూపాయలతో పార్టీ సభ్యత్వం నమోదు చేసుకుంటే ఐదు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టిడిపి నాయకులు కోరారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ముమ్మడి నాగేంద్రారెడ్డి ముమ్మడి బాబురెడ్డి ముమ్మడి సుధాకర్ రెడ్డి డేకిరెడ్డి మోక్షేశ్వర్ రెడ్డి తుమ్మల వాసురావు యలగల రామకృష్ణ మాజీ సర్పంచ్ సత్యరాజు భూమా బైరెడ్డి బూత్ కన్వీనర్ చాంద్ భాషా యలగల తిరుపాలు యలగల చిన్నస్వామి అన్నెపోగు సుబ్బరాయుడు ఎర్రన్న విజయుడు సుధాకర్ సునీల్ నాని చంద్ర మౌలీష్ రెడ్డి ముమ్మడి భాస్కర్ రెడ్డి పాలనాగిరెడ్డి మునాఫ్ పట్టాన్ మాభాష కొర్రపోలు జగన్ మాదిగ నత్తి వెంకటేశులు విజయ్ రమేష్ గంటేపొగు బాబు శ్రీనువాసులు ముమ్మడి భాస్కర్ రెడ్డి శంకర్ రెడ్డి
నరసప్ప వెంకటయ్య బాలసుబ్బయ్య రవి దర్గయ్య నాగన్న ఎల్లయ్య టిడిపి నాయకులు మేదర్ కాలనీవాసులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.