మారెళ్ళ గ్రామంలో ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

మారెళ్ళ గ్రామంలో ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

తుగ్గలి,  న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని గల మారెళ్ల గ్రామంలో పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రాంపల్లి ఆర్.తిరుపాల్ నాయుడు నేత్రుత్వంలో మారెళ్ల గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఈడిగ వెంకట రాముడు,డి.వెంకట రాముడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు సోమవారం రోజున ప్రారంభించారు.ఈ సందర్బంగా గ్రామ టీడీపీ నాయకులు, మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు,తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను కేవలం 100 రూపాయలతో చేసుకుని భవిష్యత్ కార్యాచరణలో పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి టీడీపీ కుటుంబ సభ్యులు భవిష్యత్ లో అనుకోని ప్రమాధాలు,సాధారణ మరణాలు చెందిన వారి కుటుంబాల కోసం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఉన్న 18 సంవత్సరాలు పైబడిన ఎవరైనా పార్టీ సభ్యత్వం చేసుకోవాలని, తెలుగుదేశం పార్టీ గతంలో 2లక్షల భీమా క్రింద అందించేదని ప్రస్తుతం సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల భీమా వర్తింపజేస్తుందని,తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు మరణించినా వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి 5లక్షల రూపాయల భీమా స్వయంగా అందిస్తుందని,కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి టీడీపీ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు చేయు కార్యకర్తలు శివా రెడ్డి,కౌశిక్,అంజి,శ్రీరాములు, ముక్కెళ్ళ గ్రామ సర్పంచ్ గౌరవ సలహాదారులు రామచంద్ర,నల్లగుండ్ల టీడీపీ నాయకులు కుషినేని రవి, పెండేకల్ జల్లా రామచంద్ర,మారెళ్ల టీడీపీ పార్టీ కార్యకర్తలు మద్దయ్య, కె.నరేష్,మొర్రి శివ శంకర్,బల్లె కిట్టయ్య, మహేష్,వై.కె భరత్,టి.చంద్ర,రవి కుమార్ మరియు టిడిపి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!