మండల వ్యాప్తంగా ఘనంగా పాఠశాలల్లో ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశాలు

మండల వ్యాప్తంగా ఘనంగా పాఠశాలల్లో ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశాలు

ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే వీరుపాక్షి,టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 20 స్టూడెంట్ సిట్టింగ్ టేబల్స్ అందిస్తాం టిడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ.
పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా ఎమ్మెల్యే వీరుపాక్షి.
హోళగుంద,న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశాలు ఘనంగా జరిగింది.ఇందులో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మండలంలోని అన్ని పాఠశాలలను పచ్చని తోరణాల,రంగు రంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.మండల కేంద్రంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల చైర్మన్ ద్వారక నా థ్ అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశానికి ఎమ్మెల్యే విరుపాక్షి,తెలుగు దేశం పార్టీ ఇంచార్జీ వీరభద్ర గౌడ ముఖ్య అతిథులుగా హాజయ్యారు.ఈ సందర్భంగా ఇంచార్జీ వీరభద్ర గౌడ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందించడంలో పాటు పాఠశాల ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కారానికి త్వరితగతిన కృషి చేస్తానన్నారు.అంతేకాకుండా పాఠశాలల్లో విద్యార్థులు కూర్చునే డెస్క్ ల కొరత ఉండడంతో 20 డెస్క్ లు విరాళంగా అందిస్తానని చెప్పారు.అనంతరం ఎమ్మెల్యే వీరుపాక్షి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి పరమైన ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తెస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని సహకారం అందిస్తానన్నారు.అదేవిధంగా మండల వ్యాప్తంగా 26 ప్రాథమిక పాఠశాలలో,5 ప్రాథమికోన్నత పాఠశాలలో,6 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో,కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమావేశ మహోత్సవ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా జరిగాయి.కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు టగ్ ఆఫ్ వార్,ముగ్గుల పోటీలు నిర్వహించారు.అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు.అదేవిధంగా కొత్తపేట పాఠశాలకు తహసిల్దార్ సతీష్, ఎస్సై బాల నరసింహులు కస్తూరి బా గాంధీ బాలికల పాఠశాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి విజయ లలిత,గ్రామ సర్పంచ్ తనయుడు పంపాపతి,రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎంపిటిసి శేఖన్ బీ,ఉర్దూ పాఠశాలలో ఎంపిపి తనయుడు ఈసా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.మరియు మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ,గజ్జహల్లి పాఠశాలలో జగన్నాథం హాజరయ్యారు.ఇక తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతి,నైతిక ప్రవర్తన మరియు వారి భవిష్యత్ ప్రణాళికల గురించి ఉపాధ్యాయులు సమగ్ర వివరణను అందించారు.ఈ సమావేశంలో తల్లిదండ్రుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని నింపాయి.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ మండల విద్యాశాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ,నేషనల్ కౌన్సిల్ మెంబర్ నేషనల్ చిదానంద,మండల అధ్యక్షులు ప్రసాద్,ఊళ్లూరు సిద్ధప్ప,కాళిక ప్రసాద్,రైస్ మిల్ మురళి,పంపాపతి,దిడ్డి వెంకటేష్,తిప్పన్న,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప,జనసేన పార్టీ అశోక,చిన్న,వలి, నూరుల్లా,వీరేష్,వెంకటేష్,వైసిపి మండల కన్వీనర్ షఫీవుల్లా,ఎంపిటిసి మల్లికార్జున షేక్షవలి,మల్లయ్య,గిరి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!