విద్యార్థుల ఎదుగుదలకు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్స్ దోహద పడుతాయి

విద్యార్థుల ఎదుగుదలకు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్స్ దోహద పడుతాయి

 ఈడిగ పేట హెచ్ఎం అనురాధ

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంలోని ఈడిగ పేట జడ్పీ హైస్కూల్ నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొని పిల్లల ప్రగతి గురించి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు స్కూల్ గురించి, స్కూల్లో చేపడుతున్న కార్యక్రమాల గురించి, విద్యార్థుల ప్రగతి గురించి వివరించారు. హెచ్ఎం అనురాధ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పట్ల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అనునిత్యం దృష్టి పెడుతూ వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని, పాఠశాలలో జరిగే అభివృద్ధికి పాటుపడాలని, విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు మంచి ప్రతిభావంతులుగా చేయడానికి ఇరువురు సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు. ఈ సమావేశానికి
ముఖ్యఅతిథిగా సిడిపిఓ రాజేశ్వరి, ఎస్ఎంసి చైర్మన్ మురళి , వైస్ చైర్మన్ బేబీ , తల్లిదండ్రులు ,పాఠశాల సిబ్బంది, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS