ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి

ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి

   ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు : ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రభుత్వం రక్షణ కల్పించాలని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విజయం సుబ్బారెడ్డి కోరారు. ఇటీవల రాయచోటిలో ఓ పాఠశాలలో ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు వ్యవహరించిన తీరును వారు ఖండించారు. విద్యార్థులకు అనునిత్యం విద్యా బోధనలు వాడి ఉన్నత లక్ష్యాలకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులపై దాడులను నివారించేలా రక్షణను కల్పించాలని కోరారు. విద్యార్థుల దాడిలో మృతి చెందిన ఉపాధ్యాయునికి నివాళులర్పిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా విద్యాశాఖ మంత్రి ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ భాస్కర్ ,ట్రెజరీ హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!