ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలిక రద్దు
కడప, న్యూస్ వెలుగు; ఈ నెల 23న సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని గ్రీవెన్సు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలు, ప్రగతిని జిల్లా ప్రజలకు తెలియచేజేసేందుకు “ఇది మంచి ప్రభుత్వం”, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ -2047 కార్యక్రమాల్లో భాగంగా జిల్లా అంతటా గ్రామసభలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ నెల 23న సోమవారం జరగాల్సిన ప్రజల నుండి వినతులను స్వీకరించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలిక రద్దు చేశామన్నారు. జిల్లా అధికారులు, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడివోలు, పంచాయతీ సెక్రెటరీలు, ఇతర అధికారులు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఆ ప్రకటనలో తెలిపారు.