
పది రూపాయల నాణేలు చట్టబద్ధ మైనవి
కర్నూలు, న్యూస్ వెలుగు; రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, కెనరా బ్యాంకు కర్నూలు పట్టణంలో పది రూపాయల నాణెం చెల్లు బాటు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పది రూపాయల నాణేలు చట్టబద్ధ మైనవి అని , మన రోజు వారి లావాదేవిలకు పది రూపాయల నాణేలు ను వినియోగించుకోవచ్చు అని కెనరా బ్యాంక్ బాలాజీ నగర్ మేనేజర్ తెలియజేసారు. ఈ సందర్భం గా కర్నూలు పట్టణం లో ఉన్నకెనరా బ్యాంక్ అన్నీ శాఖల మేనేజర్ లు పట్నం లో ఉన్న షాపుల యాజమానులకు మరియూ వినియోగ దారులకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శక పత్రం తో పాటు పది రూపాయల నాణేలు ను వారికి అందిస్తూ అవగాహన కల్పించారు
ప్రజలందరు పది రూపాయల నాణేలు ను చెలామణి లో ఉండెలా చూడాలని విఘ్నప్తి చేసారు. మన దైనందిన జీవితం లో వాడే ప్రతి ఖర్చుకు పది రూపాయల నాణేలు ను వాడుకోవలని, వీటిని అన్నీ దుకాణాలు, బ్యాంకులు ఆమోదిస్థాయని ఈ సందర్భం గా కెనరా బ్యాంకు బాలాజీ నగర్ మేనేజర్ తెలిపారు.