
ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రభుత్వ జూనియర్ కళాశాల,కేజీబీవీ పాఠశాలల యందు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైయ్యాయి.ఇందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏ సెంటర్ నందు 172 మంది విద్యార్థులకు గాను 165 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 7 మంది విద్యార్థులు గైర్హాజరు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీ సెంటర్ నందు 174 మంది విద్యార్థులకు గాను 169 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 5 మంది విద్యార్థులు గైర్హాజరు,ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 140 మంది విద్యార్థులకు గాను 139 పరీక్షలు వ్రాయగా ఒకరు గైర్హాజరు,కేజీబీవీ పాఠశాల నందు 120 మందికి గాను 118 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా ఇద్దరు గైర్హాజరైనట్లు పరీక్ష కేంద్రాల చీఫ్ లు పాత్రికేయులకు తెలియజేశారు.అలాగే హెబ్బటం స్రవంతి,ఉమేష్, హోళగుంద రసూల్ తో పాటు 11 మంది వికలాంగులు ప్రభుత్వ ఆదేశాలతో సహాయకులతో పరీక్షలు వ్రాశారు.