జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తాగు నీరు అందించడమే లక్ష్యం

జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తాగు నీరు అందించడమే లక్ష్యం

కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించడమే లక్షంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలి .కోడుమూరు, మంత్రాలయం, ఆలూరు ప్రాంతాల వాసులు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మించుకుంటే తాగు, సాగు నీటి కష్టాలు తీరుతాయి.. ఎం.పి బస్తిపాటి నాగరాజు,కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు సాగు , తాగు నీరు అందించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు , అధికారులు కృషి చేయాలని ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు.. జిల్లా పరిషత్ లో జెడ్పి చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ జిల్లాలో ని కోడుమూరు , మంత్రాలయం, ఆలూరు ప్రాంతాలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు.. అల్లారుదిన్నె నుంచి నీటి సరఫరా అయ్యే పైపు లైన్లు దెబ్బతినడంతో బిలేకల్లు, అట్టేకల్, ఉప్పాలదొడ్డి గ్రామాల ప్రజలు తాగునీరు లేక అల్లాడుతున్నారన్నారు.. మరో పక్క గాజులదీన్నే ప్రాజెక్టుకు కూత వేటు దూరంలో ఉన్న కోడుమూరు పట్టణంలో వారానికి ఒకసారి తాగునీరు అందే దుస్థితి నెలకొందన్నారు.. కోడుమూరు పట్టణ ప్రజలకు తాగు నీటికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.. ఇక జిల్లాలో గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టు లను నిర్మించుకుంటే తాగు నీటి తో పాటు సాగు నీరు అందుతుందన్నారు..ఈ సమావేశంలో మంత్రి టీ.జి భరత్, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా , నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గానియా , పాణ్యం ఎం.ఎల్.ఏ గౌరు చరిత, ఆలూరు ఎం.ఎల్.ఏ విరూపాక్షి, నందికొట్కూరు ఎం.ఎల్.ఏ జయసూర్య, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కర్నూలు , నంద్యాల జిల్లాల జెడ్పిటీసీలు, ఎంపీపీలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!