
పిజిఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయాలి
జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య
కర్నూలు, న్యూస్ వెలుగు; పిజిఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జాయింట్ కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు..పిజిఆర్ఎస్ కు సంబంధించి రీఓపెన్ కేసుల మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, ఆదోని వద్ద 51, పత్తికొండ ఆర్డీఓ వద్ద 39, కర్నూలు ఆర్డీఓ వద్ద 34, ఆదోని ఆర్డీఓ వద్ద 29, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, కర్నూలు వద్ద 24 రీ ఓపెన్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అదే విధంగా రెవెన్యూ గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులు రీఓపెన్ అయిన వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 22ఎ గ్రీవెన్సులు జిల్లాలో సుమారు 326 ఓపెన్ అయ్యాయని, అందులో కృష్ణగిరి తహశీల్దార్ వద్ద 76, గోనెగండ్ల తహశీల్దార్ వద్ద 68 ఎక్కువ శాతం ఓపెన్ అయ్యాయని పరిష్కారం అయ్యే సమస్యను ఎప్పటికపుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా పిజిఆర్ఎస్ లాగిన్ లో పరిష్కారం చేసిన అర్జీలను ఆడిట్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగిందని, కావున ఆడిట్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.సిఎంఓ గ్రీవెన్స్ లకు సంబంధించి పత్తికొండ ఆర్డీఓ వద్ద 17, ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 15, ఆర్డీఓ కర్నూలు వద్ద 10, డిఎస్ఓ వద్ద 2, ఎఓ కలెక్టరేట్, జిల్లా పురావస్తు అధికారి, జిల్లా కోఆపరేటివ్ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, డిఎస్పీ కర్నూలు, మున్సిపల్ కమీషనర్, వక్ఫ్ బోర్డు వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పు న పెండింగ్ లో వాటిని బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లకుండా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కొండయ్య, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు