
రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు కేంద్రం సహకరించాలి
సీమ ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్నాయి
పోలవరం బనకచర్ల ప్రాజెక్టుల అనుసంధానానికి కేంద్రం నిధులు కేటాయించాలి.
పార్లమెంటు లో ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ వెలుగు; కరువుతో పోరాడుతున్న రాయలసీమ జిల్లాలను శస్యశ్యామలం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పార్లమెంటులో కోరారు… రెండో విడత బడ్జెట్ సమావేశాల లో భాగంగా జీరో అవర్ మాట్లాడారు.. సరైన నీటి వసతులు లేక సీమ జిల్లాలు కరువుతో అల్లాడుతున్నాయన్నారు… దీంతో వ్యవసాయం మీదే ఆధారపడ్డ రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు… కేవలం 25 శాతం మాత్రమే పంటలు సాగవుతుండటంతో ప్రతి ఏడాది రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..ఇక రాయలసీమ లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సీ.ఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని , అందులో భాగంగా పోలవరం బనకచర్ల నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారన్నారు.. ప్రాజెక్టుల అనుసంధానం ద్వారా గుంటూరు జిల్లా గోళ్లపల్లి వద్ద ఒక రిజర్వాయర్, నంద్యాల జిల్లా బనకచర్ల వద్ద ఒక రిజర్వాయర్ ఏర్పాటవుతాయాన్నారు.. దీంతో 80 లక్షల ఎకరాలకు సాగు నీరందడంతో పాటు , తాగు నీరు అందుతుందన్నారు.. ప్రాజెక్టుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఎం.పి నాగరాజు కోరారు..


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar