
బాధితునికి సీఎం సహాయనిది చెక్కు అందజేత
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; బండిఆత్మకూరు మండలంలోని కడమలకాల్వ గ్రామనికి చెందిన డక్క శాంతిరాజ్ కు సీఎం సహాయనిది చెక్కును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందజేశారు. గత కొంతకాలం నుండి హాస్పిటల్ లో అనారోగ్యం తో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు సతమతం అవుతున్న శాంతిరాజు స్థానిక టిడిపి నాయకుడు మద్దిగారి మదన్ భూపాల్ విషయం తెలుపగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయనిధి కి దరఖాస్తు చేయించారు. బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వార మంజూరైన 20800 రూపాయల చెక్కును ఆత్మకూరు టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాపయ్య,పుష్పరాజు, సుబ్బలక్ష్మయ్య, వడ్డేఎల్లయ్య ,చాకలి రమణ , గౌండవలి, అనకలి బాలుడు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 JOURNALIST B SAIKUMAR NAIDU
 JOURNALIST B SAIKUMAR NAIDU