
ముగిసిన దేవరగట్టు ఉత్సవాలు
నెరణికి గ్రామంలో దసరా పండుగ
ఉత్సవ విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.అక్కడ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద విగ్రహాలను కొలువుంచి పూజలు చేసి మహామంగల హారతి చేశారు.ఈ సందర్భంగా నెరనికి గ్రామ ప్రజలు బుధవారం దసరా పండుగ వేడుకలను ఘనంగా చేసుకున్నారు.అలాగే ఆంజనేయస్వామి ఆలయం నుంచి మల్లేశ్వరస్వామీ దేవాలయానికి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహిళలు,చిన్నారులు కళశాలు పట్టుకుని ఆలయానికి చేరారు.శ్రీ మాళ మల్లేశ్వరస్వామి కంకణ ధారణ నుంచి నిష్ఠతో ఉన్న ప్రజలు బుధవారం ముగింపు సందర్భంగా వేడుకలను ఘనంగా జరుపుకుని దీక్షను విరమించారు.కానిస్టేబుల్ పెద్దయ్య నాయుడు స్వామివారి పల్లకి మోస్తూ భక్తిని చాటుకున్నాడు.ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ బాల నరసింహులు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు.