తెలుగుదేశం ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి
* పల్లె పండుగ కార్యక్రమంతో మారనున్న గ్రామాల రూపురేఖలు
* హాజరైన మండల టిడిపి నాయకులు,కార్యకర్తలు
* ఘనంగా రాతన గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమాన్ని మండల స్థాయి అధికారులు,టిడిపి నాయకులు,ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహిస్తున్నారు.పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు ఆదేశాల మేరకు శనివారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల రాతన గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని టిడిపి నాయకులు,అధికారులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాతన గ్రామం నందు ఉపాధి హామీ నిధుల కింద ఏర్పాటు చేస్తున్న సిసి రోడ్డు పనులకు వారు భూమి పూజ నిర్వహించారు.రాతన గ్రామం నందు 200 మీటర్ల విస్తీర్ణంలో ఉప్పరి గిడ్డయ్య ఇంటి నుండి బోయ వెంకట నాయుడు వామిదొడ్డి వరకు గల సిసి రోడ్డు ఏర్పాటుకై అధికారులు మరియు మండల టిడిపి నాయకులు భూమి పూజ నిర్వహించారు.భూమి పూజ అనంతరం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మండల టిడిపి నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతాయని వారు తెలియజేశారు.కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాల రూపురేఖలు మారిపోతాయని వారు తెలియజేశారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాలలో రోడ్డు,డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపడతాయని వారు తెలియజేశారు.అదేవిధంగా గ్రామాలలో గల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని వారు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని వారు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆలోచన విధానంతో మరియు కేంద్ర సహకారంతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ చౌదరి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తిరుపాల్ నాయుడు,ఉపాధ్యక్షులు వెంకట రాముడు చౌదరి,ఎద్దులదొడ్డి శ్రీనివాస్ గౌడ్,బొందిమడుగుల సర్పంచ్ గౌరవ సలహాదారులు ప్రతాప్ యాదవ్, గ్పత్తికొండ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఈరన్న స్వామి,కృష్ణమూర్తి చౌదరి, కాలయ్య ఆచారి,మాజీ ఎంపీటీసీ సభ్యులు మారెన్న,మై రాముడు,రాతన కొత్తూరు కోటేశ్వరుడు,మామిళ్ళకుంట తిమ్మప్ప,గ్రామ కమిటీ అధ్యక్షుడు సంజీవ,మేకల లక్ష్మన్న,దేవేంద్ర,ఈరన్న, చెన్నంపల్లి మా భాష,పెండేకల్ చాంద్ భాష,జయసింహ,వీఆర్వో నాగేంద్ర, ఏపీవో హేమ సుందర్,పంచాయతీ కార్యదర్శి శివ,ఈసీ ప్రదీప్ తదితర మండల నాయకులు,మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.