
న్యూస్ వెలుగు కథనానికి స్పందించిన జిల్లా యంత్రాంగం
భవిష్యత్ లో పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం…
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి; తుగ్గలి మండలం పరిధిలోని ఆర్ ఎస్ పెండేకల్ లో స్థానికంగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ లో నవంబర్ 06 వతేది మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులకు చిక్కీలను పంచిన సమయంలో ఒక చిక్కిలో పురుగుపడిన విషయం జిల్లా విద్యాధికారుల దృష్టికి వెళ్లిన తరుణంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు పంచిన చిక్కిలలో గత సెప్టెంబర్ మాసంలో వచ్చిన స్టాక్ అయినందువలన ఒక చిక్కిలో పురుగుపడినందున మేము వివరణ ఇస్తూ తుగ్గలి మండల విద్యాధికారికి మరియు జిల్లా విద్యాధికారికి తెలియజేస్తూ విద్యార్థులకు చిక్కిల పంపిణి విషయంలో భవిష్యత్ లో మళ్ళీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!