
షెడ్యూల్డ్ ను విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఢిల్లీ : జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. హర్యానా అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 3, 2024తో ముగియనుండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 26తో ముగుస్తుండగా , జార్ఖండ్ విషయంలో జనవరి 5తో ముగుస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది.
Was this helpful?
Thanks for your feedback!