FlatNews Buy Now
ఆర్టీఈ చట్టం అమలులో ఉన్న లోపాలను సవరించి,పేదలకు న్యాయం జరిగేలా చూడాలి

ఆర్టీఈ చట్టం అమలులో ఉన్న లోపాలను సవరించి,పేదలకు న్యాయం జరిగేలా చూడాలి

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ను కలిసి వినతిపత్రం సమర్పించిన ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్

కర్నూలు, న్యూస్ వెలుగు : రైట్ ఆఫ్ చిల్డ్రన్ టూ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009(R.T.E)అమలులో లోపాలను సవరించి నిజమైన పేదలకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,సమితి నాయకులు కె.రాము కర్నూలు

జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ను ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీఈ చట్టం అర్హత ప్రమాణాలను కఠినంగా పరిశీలించి నిజమైన పేద విద్యార్థులకే లబ్ధి కల్పించాలని,తప్పుడు ధృవపత్రాలతో లబ్ధి పొందుతున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని,ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచాలని,పాఠశాలలు అదనపు ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని,25శాతం సీట్లు కేటాయింపును పూర్తిగా ఆన్‌లైన్ మరియు పారదర్శక విధానంలో నిర్వహించాలని,జిల్లా స్థాయిలో ప్రత్యేక ఫిర్యాదు పరిష్కార కమిటీ ఏర్పాటు చేయాలని,గ్రామ/వార్డు స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,ప్రైవేటు పాఠశాలలకు ప్రభూత్వం చెల్లించాల్సిన ఆర్టీఈ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని,20,000/- లోపు జీతాలు కలిగిన ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగుల పిల్లలకు ఆర్టీఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ అధికారులు మరియు ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులతో త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేసి ఆర్టీఈ చట్టాన్ని పారదర్శకంగా అమలయ్యేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు సురేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS