ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల దోపిడీని అరికట్టాలి. డివైఎఫ్ఐ
కడప, న్యూస్ వెలుగు; ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొంటున్న ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.మంగళవారం నాడు జిల్లా కార్యాలయం నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ దసరా పండుగ సీజన్ లో ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని జిల్లా లో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రజల వద్ద నుండి అధిక రీతిలో ధరలు చార్జీలు వసూలు చేస్తున్నారు అన్నారు.పండుగ పూట రావాలన్న తిరిగి వెళ్ళాలన్న ప్రజల భయపడే రీతిలో ట్రావెల్స్ యజమానులు చార్జీలు వసూలు చేస్తున్నాయి అన్నారు.విజయవాడ, హైదారాబాద్ వంటి ప్రాంతాలకు 3000 రూపాయలు నుండి 5000 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఎదేచ్చగా పబ్లిక్ గా ఆన్లైన్ లోనే అధిక మొత్తంలో ధరలు చూపిస్తున్న రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదు అంటే ఏ స్థాయిలో నిర్లక్ష్యం గా వున్నారో అర్థం అవుతున్నది అన్నారు.కేవలం రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం తోనే ఇదంతా జరుగుతుంది అన్నారు.లేదంటే మామూళ్ల మత్తులో జోగున్నారా అని అనుమానం వ్యక్తం అవుతుంది అన్నారు.అధికారులు ఇప్పటికైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇటువంటి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు పై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో డివైఎఫ్ఐ గా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.