దేశం గర్వించదగ్గ వ్యక్తి జాతిపిత
హ్యూమన్ రైట్స్ నేషనల్ రీజినల్ వైస్ చైర్మన్ రామ్మోహన్
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని హ్యూమన్ రైట్స్ నేషనల్ రీజినల్ వైస్ చైర్మన్ కుంటుముల్ల రామ్మోహన్ పేర్కొన్నారు.ఈరోజు మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలోని హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో వివిధ విభాగాల హ్యూమన్ రైట్స్ సభ్యులు మరియు న్యాయవాదుల సమక్షంలో మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం చేసిన ఎన్నో త్యాగాలు గుర్తుకు చేసుకున్నారు.ఆయన త్యాగ ఫలితంతోనే భారత దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు తెలిపారు.అనంతరం సీనియర్ న్యాయవాది ఓబులేసు మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని,నేటియువత ఆయనను స్ఫూర్తిగా తీసు కోవాలని తెలిపారు.హ్యూమన్ రైట్స్ రాష్ట్ర వైస్ చైర్మన్ భాస్కర్ బాబు మాట్లాడుతూ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ మన హక్కుల సాధించుకోవడంలోహ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా పోరాడాలని ఏలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొని వస్తే ప్రజా సమస్యల పరిష్క రిస్తామని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జమ్మలమడుగు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అన్నపురెడ్డి రాణెమ్మను హ్యూమన్ రైట్స్ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలో మాల మహా కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు దండు రమేష్, వెల్దుర్తి గ్రామపంచాయతీ సర్పంచ్ విశ్వనాధ్, న్యాయ వాదులు కిషోర్, దివాకర్, సభ్యులు చంద్ర మోహన్, ప్రతాప్, గణేష్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.