రాష్ట్ర ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
టీడీపీ మండల ఉపాధ్యక్షుడు వెంకటరాముడు చౌదరి
తుగ్గలి, న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తుగ్గలి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వెంకట రాముడు చౌదరి తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున పత్తికొండ శాసనసభ్యులు కే ఈ శాంబాబు ఆదేశాల మేరకు రాంపురం,కొట్టాల గ్రామాలలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమాన్ని టీడీపీ తుగ్గలి మండల ఉపాధ్యక్షుడు వెంకట్ రాముడు చౌదరి ఆధ్వర్యంలో ప్రారంభించగా గ్రామ సచివాలయం సిబ్బంది మరియు టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపాధ్యక్షులు వెంకట్రాముడు చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటుందన్నారు.రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్దిదారులైన అవ్వ తాతల పెన్షన్ 4000,వికలాంగుల పెన్షన్ 6000, రాష్ట్రంలోని లక్షలాదిమంది నిరు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు, నిరుద్యోగులైన యువతకు బంగారు భవిష్యత్తుకు మెగా డీఎస్సీ, ప్రజల సొంత భూమి స్టిరాస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, విజయవాడ లోని వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయడం తో పాటు మరో సంక్షేమ పథకాలను అందించేందుకు మన ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ఈ ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజమణి,గ్రామ టిడిపి నాయకులు భీమ లింగప్ప,చంద్రన్న,మద్దిలేటి, చిన్న కమల్,ఇస్మాయిల్,మోదిన్ సాహెబ్, తలారి నాయుడు,మల్లయ్య మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.