తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

Tealangana (తెలంగాణ ) : కాంగ్రెసు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇచ్చిన్న హామీలు వీలైనంత తొందరగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని అర్హుడైయిన ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలను అంధిస్తామన్నారు.  అనంతరం  సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పి.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన కుటుంబాలందరికీ ఆరోగ్యశ్రీ హెల్త్‌కార్డులు, తెల్లరేషన్‌కార్డులు విడివిడిగా అందజేయాలని కేబినెట్‌ నిర్ణయించిందని తెలిపారు. హెల్త్‌కార్డులలో నివాసితులందరి ఆరోగ్య ప్రొఫైల్‌లు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ, ఆరోగ్య, పౌరసరఫరాల శాఖ మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

క్రీడాకారులు ఇషా సింగ్, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్‌లకు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల ఇళ్ల స్థలాల కేటాయింపునకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. నిఖత్, సిరాజ్‌లకు కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు కల్పించనున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!