మెడికల్ సీట్ల విషయం పై ప్రభుత్వం పునరాలోచించాలి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు ; రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ సీట్ల విషయం పై ప్రభుత్వం పునరాలోచించాలని పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చూడాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.స్థానిక ఎన్జీవో కార్యాలయం నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి కి మెడికల్ సీట్లు విషయం పై నిర్వహించలేమని లేఖ రాయడం వలన ఎంబీబీఎస్ చేయాలని డాక్టర్లు కావాలనే కల పేద విద్యార్థులకు కలగానే మిగిలిపోయే ప్రమాదం వుంది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వాస్తే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ని అధికారంలోకి వస్తె రద్దు చేస్తామని చెప్పి ఆ విధానాన్ని రద్దు చేయకుండా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ సీట్లు భర్తీ చేయాలనే విధానం వలన పేద విద్యార్థులకు,తమ పిల్లలను డాక్టర్లు చేయాలనే తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం వుంది అన్నారు.ముఖ్యంగా పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన 50 మెడికల్ సీట్లను నిర్వహించలేమనీ చెప్పడం వెనుకబడిన రాయలసీమ ప్రాంత విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయడమే అన్నారు.విద్యార్థులు ఇప్పటికే లాంగ్ టర్మ్ పేరుతో నీట్ కు కోచింగ్ లు తీసుకుంటూ లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని అన్నారు.ఇప్పుడు ఈ విధానం కారణంగా ఎంబీబీఎస్ సీట్లు మరింత ఖరీదు అయ్యే అవకాశం వుంది అన్నారు. ఈ విధానం ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభదాయకం అన్నారు.ఒకవైపు ఇతర రాష్ట్రాలు మెడికల్ కాలేజీలు,సీట్లు అధికంగా కేటాయించమని అడుగుతుంటే కూటమి ప్రభుత్వం వద్దు అనడం విడ్డూరంగా వుంది అన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మెడికల్ సీట్లు భర్తీకి చర్యలు చేపట్టాలని వెనక్కి పంపే నిర్ణయాన్ని పునరాలోచించాలని లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ తో ముడిపడి వున్న విషయం కావున ప్రభుత్వం మెడికల్ సీట్ల భర్తీకి చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అన్నారు.సమావేశంలో జిల్లా కమిటీ సభ్యుడు ప్రసాద్,కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.