
వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్న ప్రభుత్వం
News Velugu Sachivalayalm : కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఆగస్టు 2న అమలు చేయాలని నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు ఈ పథకం వల్ల లబ్ది పొందుతారని ఆయన తెలిపారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్ల నిధుల్ని వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నట్లు సిఎం తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!