రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావటానికి నారా చంద్రబాబునాయుడు కృషి నారా లోకేష్ రెక్కల కష్టమే కారణం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావటానికి నారా చంద్రబాబునాయుడు కృషి నారా లోకేష్ రెక్కల కష్టమే కారణం

   జిల్లా టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి వెల్లడి

కర్నూలు, న్యూస్ వెలుగు; రాష్ట్రంలో గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీల గెలుపు, ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధాన కారణం తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ రెక్కల కష్టమే ప్రధానకారణమనీ కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి వెల్లడించారు. ఈ రోజు పత్తికొండ నియోజకవర్గం, క్రిష్ణగిరి మండలం, కంబాలపాడు గ్రామంలో పార్టీ శాసనసభ్యులు కె.యి. శ్యామ్కుమార్ అధ్వర్యంలో జరిగిన జరిగిన ముఖ్యనేతల సమావేశానికి హాజరైన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకనాడు పత్తికొండ నియోజకవర్గం అంటే వెనుకబడిన ప్రాంతమనీ, కక్ష్యలు, కార్పణ్యాలతో ఉండేదనీ అయితే నేడు పత్తికొండ నియోజకవర్గం అభివృద్దికి మారుపేరుగా మారబోతుందనీ తెలియజేస్తూ, ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పత్తికొండ నియోజకసర్గం పర్యటనకు వచ్చిన సందర్భంగా పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధికై ఎన్నో హామీలు ఇవ్వడం జరిగిందనీ, ముఖ్యంగా శాసనసభ్యులు కె.యి. శ్యామ్ కుమార్ గారు శ్రీ నారా లోకేష్ గారితో ఉన్న చనువుతో నియోజకవర్గంలో సాగుటీరు, సి.సి.రోడ్లు, గోకులాల నిర్ణాణాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం నిధులను తెచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుచేయడం జరిగుతుందనీ, ఇప్పటికే ఒక్క క్రిష్ణగిరి మండలంలోనే దాదాపు రూ.31.75 కోట్ల అభివృద్ధి పనులను ఈ ఏడు మాసాలలో ఖర్చు చేయడం జరిగిందనీ, దీనికి కె.యి. శ్యామ్ పట్టుదల కృషి కారణమని వివరించారు. అలాగే మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు కె.యి. కృష్ణమూర్తి తన హయాంలో నియోజకవర్గంలో చెరువులకు నీటిని నింపు బీడు బూములను సాగులోకి తీసుకొని రావడమేకాగా ఎన్నో గ్రామాలకు త్రాగునీటి సమస్యను తీర్చడం జరిగిందనీ, అసలు కె.యి. కుటుంభమంటేనే అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఒక బ్రాండుగా ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ గారు చేసిన కృషిని ఎవ్వరూ కాదనలేరనీ, సుదీర్ఘపాదయాత్ర చేసి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలను ఆకలింపు చేసుకొని ఒక పక్క రాక్షస పాలన సాగించినటువంటి వై.యస్. జగన్మోహన్రెడ్డి బ్రిటీష్ కాలంనాటి జి.ఒ. నెం. 1 తీసుకొని వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారనీ, దానిని శ్రీ లోకేష్ దీటుగా ఎదుర్కొని ప్రజలతో మమేకమై, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలిచి మే 13, 2024న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘణవిజయం సాధించడంలో వారి రెక్కల కష్టం ఎంతో ఉందనీ గుర్తుచేశారు. అలాగే నారా చంద్రబాబునాయుడు గారు ప్రజలకోసం ఎన్నో కష్టాలు ఎదర్కొన్నారనీ, చివరకు జగన్ కుటిల రాజకీయాలలో బాగంగా జైలుకు కూడా వెళ్లి రావడం జరిగిందనీ, లోకేష్, చంద్రబాబు పోరాటాల కారణంగానే నేడు రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం టిడిపి, జనసేన, బి.జె.పి. కూటమి అధికారంలో ఉన్నదనీ, రాబోయే రోజులలో కూడా కూటమి ప్రభుత్వం కొనసాగుతుందనీ, ఇందులో వై.సి.పి. ఎన్ని కుట్రలు చేసినా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమీ చేసుకోలేదనీ తెలియజేశారు.
త్వరలోనే పత్తికొండ నియోజకవర్గం మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పొందనున్నదనీ, ముఖ్యంగా టాటా, రిలయన్స్ బయోగ్యాస్, యన్.టి.పి.సి. పవర్ వంటి వాటిని తీసుకొని వచ్చి ప్రజలకు మరిన్ని సేవలు అందించడం జరుగుతుందనీ వివరించారు. కార్యక్రమంలో డా., కె.వి. సుబ్బారెడ్డి, పత్తికొండ నియోజకవర్గం నాయకులు యం. సుబ్బరాయుడు, యల్.వి. ప్రసాద్, యస్కో, నబీ, శ్రీరాములు, పుల్లయ్య, మొదలగు వారు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!