పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల సాయం విలువకట్టలేనిది

పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల సాయం విలువకట్టలేనిది

వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కి రూ.25 లక్షల చెక్ అందజేసిన పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు

పుట్టపర్తి, న్యూస్ వెలుగు; విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల తరపున 25 లక్షల చెక్కును పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సాయం చెక్ ను అందజేశారు. విజయవాడ అమరావతిలోని ప్రభుత్వ సచివాలయంలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఛాంబర్ లో గురువారం వారు ఈ చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ బాబు మాట్లాడుతూ,
కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతో మానవత్వం చూపి ముందుకు వచ్చిన పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు మరియు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ప్రభుత్వం తరఫున ,నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. అభివృద్ధిలో ఎంతో వెనుకబడి జిల్లాల్లో సత్యసాయి జిల్లా ఒకటి అన్నారు. ముఖ్యంగా ఆపదలో ఉన్న విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంచి ఉద్దేశ్యం తో వారికి అన్ని విధాలుగా మేమున్నాం …అంటూ వరద బాధితులకు ఆర్థికంగా సాయం అందించిన పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల మేలు ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ధైర్యంగా నిలబడే నిబద్దత ఉన్న నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. వారి బాటలో ఎంతో మంది తమ వంతు సహాయంగా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున ,టీడీపీ తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు వరద బాధితులకు ఇది వరకే గన్నవరం ,మైలవరం నియోజవర్గాల్లో ఉన్న వరద బాధితులకు సుమారు రూ. 50 లక్షలు విలువ చేసే ఆహార ధాన్యాలను కూడా బాధిత కుటుంబాలకు మా టీడీపీ ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్ యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గాల్లో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఈరోజు రూ.25 లక్షల రూపాయలు విరాళంగా అందించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి ప్రభుత్వం తరపున , టీడీపీ తరపున నారా లోకేష్ బాబు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయడంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రత్యేకంగా గుర్తింపు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలా సేవ చేయడంలో పల్లె రఘనాథరెడ్డి ఎప్పుడు ముందు ఉంటారని అందుకు ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రజలకు అందించిన సేవలే ఇందుకు నిదర్శనం అని మంత్రి నారా లోకేష్ బాబు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!