కంది,శనగ పంట సాగులో వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: ప్రస్తుతం సాగులో ఉన్న కంది మరియు శనగ పంటల సాగులో వ్యవసాయ అధికారులు సూచనలను పాటించాలని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు.సోమవారం రోజున ఆయన మాట్లాడుతూ మద్దికేర మండలంలోని 12,473 ఎకరాలలో కంది పంట మరియు 20,000 వేల ఎకరాలలో పప్పు శనగను రైతులు సాగు చేశారని ఆయన తెలియజేశారు.ప్రస్తుతం కంది పంటను మారుక మచ్చల పురుగు ఎక్కువగా ఆశించిందని,దీని నివారణ కొరకు బెంజోయేట్ మరియు లామ్డను పిచికారి చేసుకోవాలని,అదేవిధంగా కంది పూత రాలకుండా ఉండడానికి ప్లానోఫిక్స్ మరియు బోరాన్ ను పిచికారి చేసుకోవాలి ఆయన తెలియజేశారు. అదేవిధంగా పప్పు శనగలో ఎండు తెగులు నివారణకు సాఫ్ పౌడర్ ను మొక్కల మొదలు తడిచేలా పిచికారి చేసుకోవాలని ఆయన తెలియజేశారు. అదేవిధంగా వాతావరణ బీమా వివరాల కొరకు రైతులు తమ పరిధిలోని గల రైతు సేవా కేంద్రాలను సందర్శించి రైతులు వివరాలు అడిగి తెలుసుకోవాలని ఏవో రవి తెలియజేశారు.