గండికోట నిర్వాసితుల భూములు అన్య క్రాంతమైనాయి కాపాడాలి

గండికోట నిర్వాసితుల భూములు అన్య క్రాంతమైనాయి కాపాడాలి

కడప, న్యూస్ వెలుగు; గండికోట ప్రాజెక్టుకు నిర్వాసితులైన చౌటుపల్లె గ్రామం ప్రజలకు కేటాయించిన భూములు అన్యక్రాంతమైనాయి వెంటనే ప్రభుత్వం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని నిర్వాసితులకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ డిమాండ్ చేశారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో డిఆర్ఓ కు చౌటపల్లి గ్రామం నిర్వాసితులతో కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ మాట్లాడుతూ గండికోట ప్రాజెక్ట్ కు సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులకు ముద్దనూరు మండలం మంగపట్నం రెవెన్యూ పొలంలో కేటాయించినటువంటి భూములు కు జిల్లా అధికారులు పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల ఆ భూములు రాజకీయ నాయకులు పలుకుబడి కలిగిన వారు డబ్బున్న వారు అన్హురులు స్థానికేతర్లు పెద్ద ఎత్తున వందలు ఎకరాలు ఆక్రమించు కోటం సిగ్గుచేటు అన్నారు 2010 సంవత్సరంలో చౌటపల్లి గ్రామం నిర్వాసితులకు కేటాయించిన భూములు 869 ఎకరాలకు ప్రభుత్వం జంగల్ క్లియరెన్స్ కు 31,29,696 రూపాయలు ఖర్చు చేసిందన్నారు ఆ భూములకు ఇప్పటికే అసైన్మెంట్లో ఆమోదం పొందిన పట్టాలు మంజూరు చేయాల్సింది ఉందన్నారు నిర్వాసితులకు పట్టాలు ఇవ్వకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు చాలా నిర్లక్ష్యం వహించారు కాబట్టి ఆ భూములను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే అన్యక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకొని నిర్వాసితులందరికీ ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూ పంపిణీ చేసి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గత ప్రభుత్వంలో మూడున్నర లక్ష నిర్వాసితుల కుటుంబ సభ్యులకు అందరికీ ఇవ్వలేదు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి నిర్వాసితుల మాకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వాలని అడిగితే బడ్జెట్ లేదని అధికారులు దాటేస్తున్నారు వెంటనే లబ్ధిదారులందరికీ ఇవ్వాలన్నారు ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 12 లక్షల రూపాయలు అమలు చేస్తామని ఎన్నికలలో వాగ్దానం చేశారు అ వాగ్దానమేరకు వెంటనే నిధులు విడుదల చేసి నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల నిర్వాసితులను కలుపుకొని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో చౌటపల్లి నిర్వాసితులైన రామలింగారెడ్డి యోహాన్ గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!