పత్తికొండ, న్యూస్ వెలుగు; పత్తికొండ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం 8 వ “పోషణ పక్వాడ” పోస్టర్‌ను ఎమ్మెల్యే కే.ఈ శ్యాంకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ శాఖ సిడిపిఓ పి.లలిత ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా

ఎమ్మెల్యే కే.ఈ శ్యాంకుమార్ మాట్లాడుతూ, సమాజంలో తల్లి-శిశు ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, సరైన పోషకాహారం ద్వారా ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించవచ్చని తెలిపారు. “పోషణ పక్వాడ” కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమతుల ఆహారం, పోషక విలువలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రతి ఇంట్లో పోషకాహారం పై శ్రద్ధ పెంచి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామస్థాయిలో అంగన్‌వాడి కేంద్రాలు, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా “పోషణ పక్వాడ” ర్యాలీ కార్యక్రమాన్ని ఎంపీడీవో కవితా రెడ్డి ప్రారంభించారు ఎంపీడీవో ఆఫీస్ నుంచి ఐసిడిఎస్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ త్రివేణి, అంబిక మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Thanks for your feedback!