
శ్రీశైల ఉత్తరద్వార మార్గం ఉమామహేశ్వరం తో ప్రారంభo
శ్రీశైలం, న్యూస్ వెలుగు; శ్రీశైల ఉత్తరద్వార మార్గం ఉమామహేశ్వరం తో ప్రారంభమవుతుంది. భ్రమరాంబ చెరువు
మీదగా మేడిమల్కల చేరుకొని అక్కడనుండి అక్కగవి వద్దకు వచ్చి కృష్ణా తీరంలోని జాతరరేవును దాటుకొని కఠినమైన చుక్కల పర్వతం ఎక్కి శ్రీశైలం చేరేవారు. జాతర రేవు నుండి చుక్కల పర్వతం ఎక్కేదారిలో మొదటిగా భైరవుని శిల్పం తర్వాత మిద్దెలగుడి అనే ఒక మండపం కనిపిస్తుంది.
చుక్కల పర్వతం ఎక్కేటప్పుడు భక్తులు పడు శ్రమను పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణం లో ఈ విధంగా వర్ణించారు.
ద్రొక్కుచు నిక్కుచు ద్రోదొటుకునుచు
జిక్కుచూ మ్రోకాళ్ళ జేతులాదుచును
జెంగుచు వ్రాళుచూ చేదించుజనచు
చేదుకో చేదుకో శ్రీగిరినాధ
చేదుకో మల్లయ్య చేదుకొమ్మనుచు
చేదుకో చేదుకో శ్రీశైల నిలయ
ఈ విధంగా పాటలు గట్టి పాడుతూ కష్టతరమైన చుక్కల పర్వతం అధిరోహించేవారు.