
రైతులు భూ సమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం
న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సూచనల మేరకు ప్యాపిలి మండల పరిధిలోని బూరుగల గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజా కుమారి మరియు నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ యాదవ సాధికారిక సమితి కన్వీనర్ రాష్ట్ర గొర్రెలు మేకల సంఘం ఫెడరేషన్ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ ఆక్ట్ తో రైతులను బెంబేలెత్తించిందని, రైతులకు రుణాలు ఇచ్చి, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలో అందించిన ప్రభుత్వం టి.డి.పి ప్రభుత్వం అని తెలియజేశారు. రైతులకు ఏ సమస్య వచ్చినా రెవిన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని తక్షణమే రైతుల పొలాలకు చెందిన సమస్యలను పరిష్కరిస్తారని రైతులకు తెలియజేశారు. ప్రజల నుంచి భూసంబంధిత సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, త్వరిగతిన పరిష్కరించాలని రెవిన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండల తాసిల్దార్ భారతి, డోన్ ఆర్డీవో, , గ్రామ నాయకులు ,చిన్నికృష్ణ హేమంత్ ,రాజు ,పెద్ద రాజు, మరియు వివిధ తెలుగు దేశం పార్టీ నాయకులు ఖాజాపీరా కౌలు పల్లి శివారెడ్డి రామేశ్వర్ రెడ్డి బావిపల్లి సతీష్ నల్లమేకల పల్లి రాజశేఖర్ మెట్టుపల్లె సుదర్శన్ లాల్రెడ్డి బోయించేర్వు పల్లి శ్రీరాములు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..