గండికోట ముంపు వాసులకు ప్యాకేజీ వర్తింప చేయాలి
మాజీ మంత్రి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలములోని గండికోట ప్రాజెక్టులో మొదటి విడత ముంపునకు గురైన 14గ్రామాలలో అప్పటీలో అధికారులు జరిపిన సోషియల్ ఎకనామిక్ సర్వేలో 14గ్రామాలలో నివాసమున్న వారి పేర్లు కూడా చాలావరకు మిస్ అయినవి. మిస్సయిన వారందరూ మా పేరు గేజెట్ లో రాలేదు విచారణ చేసి గేజట్ లో చేర్చాలని రెవెన్యూ అధికారులకు అర్జీ ద్వారా తెలియజేయగా రెవెన్యూ అధికారులు విచారణ చేసి 14 గ్రామాలలో ఎస్సీ,బీసీ,ఓసి మరియు పేదవారిని సుమారు 600 మంది ఉన్నారని గుర్తించి రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినా కూడా సమస్య ఇంకా పెండింగ్ లోనే ఉన్నది. కాబట్టి రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్టును పరిగణలోకి తీసుకొని వారిచ్చిన రిపోర్టు ప్రకారము వీరందరి పేర్లను గెజిట్లో చేర్చి ఆర్&ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలని ఈరోజు శాసనమండలిలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్పెషల్ మైన్స్ క్రింద ప్రభుత్వాన్ని కోరడమైనది.