శభాష్ పురంలో కార్డెన్ సర్చ్ ను నిర్వహించిన పోలీసులు

శభాష్ పురంలో కార్డెన్ సర్చ్ ను నిర్వహించిన పోలీసులు

 250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.

 రికార్డులు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల శభాష్ పురం గ్రామం నందు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పత్తికొండ డివిజన్ పరిధిలోని గల పోలీసుల ఆధ్వర్యంలో శనివారం రోజున పోలీసు అధికారులు కార్డెన్ సర్చ్ ను నిర్వహించారు.జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గల శభాష్ పురం గ్రామం నందు దాడులను 250 లీటర్లు బెల్లం ఊటను పోలీసు అధికారుల ధ్వంసం చేశారు. అదేవిధంగా శభాష్ పురం గ్రామం నం దు రికార్డులు సరిగా లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సారాలను విక్రయించే వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం శభాష్ పురం ప్రధాన వీధుల యందు పోలీస్ అధికారులు పెట్రోలింగ్ ను నిర్వహించారు.అనంతరం శభాష్ పురం గ్రామం నందు గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సైబర్ నేరాల పైన,యాక్సిడెంట్ల పైన పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.మండల వ్యాప్తంగా ఎవరైనా సారాను ఎవరైనా తయారుచేసినా, విక్రయించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ పులి శేఖర్ గౌడ్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అర్బన్ సీఐ జయన్న,సీఐ మస్తాన్ వలీ,తుగ్గలి ఎస్సై కృష్ణమూర్తి, జొన్నగిరి ఎస్సై జయ శేఖర్ గౌడ్,మద్దికేర ఎస్సై విజయ్ కుమార్ నాయక్,ఎస్సైలు సతీష్,తుగ్గలి,మద్దికేర,జొన్నగిరి, పత్తికొండ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!