
పొలం పిలుస్తుంది కార్యక్రమం
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక దళ్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ వీరభద్ర గౌడ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏడీఏ డిఆర్సి వేదామణి మాట్లాడుతూ రైతులు
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వ్యవసాయ అధికారుల సలహా సూచనలు తీసుకోవాలని మరియు డ్రోన్ స్పెయిన్ తో పురుగు మందులు పిచికారి చేసుకోవడం వల్ల ఖర్చు,శ్రమ, తగ్గి తక్కువ సమయంలో ఎక్కువ పొలం స్ప్రే చేసి పురుగుమందు యొక్క పనితీరును పెంచవచ్చన్నారు.అదేవిధంగా వారంలో రెండు రోజులు అనగా మంగళవారం,బుధవారాల్లో రైతు సేవ కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.అనంతరం టిడిపి ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ చేతుల మీదుగా సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏడీఏ సునీత,టిడిపి నాయకులు రాజా పంపన్న గౌడ్,పంపాపతి,వెంకటేష్,గవిసిద్దప్ప,బసవరాజు,సుభాన్,దుర్గయ్య,బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద మరియు ఏఈఓ విరుపాక్షి,విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు మణి శ్రీ,భారతి బాయి,ఎంపిఓలు నరసింహులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.