పొలం పిలుస్తోంది కార్యక్రమం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని నేరణికి,ఎల్లార్తి గ్రామాల్లో మంగళవారం మండల వ్యవసాయాధికారి ఆనంద్ లోకదళ్ పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ 2024 సీజన్ నుండి రైతులు సాగు చేసిన పంటలకు భీమా పథకం వర్తించాలి అంటే తప్పనిసరిగా కామన్ సర్వీస్ కేంద్రాల్లో ప్రీమియం చెల్లించాలి మరియు శనగ,జొన్న,వేరుశనగ,ఉల్లి,టమోటా పంటలకు డిసెంబర్ 15 లోపు,వరి పంటకు డిసెంబర్ 31 లోపు ప్రీమియం చెల్లించాలని సూచించారు.అంతేకాకుండా రబీ సీజన్ కు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ కొరకు రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు.అలాగే సాయిల్ హెల్త్ కార్డుల, నానో యూరియా,నానో డీఏపిల ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ విరూపాక్షి,వి ఏ ఏ లు రాజు నాయక్,కృష్ణవేణి,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!