నేడు పురాణ ప్రవచన కార్యక్రమం ప్రారంభం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నేడు శ్రీ కలబురగి శరణు బసవేశ్వర పురాణ ప్రవచన కార్యక్రమం ప్రారంభం అవుతుందని మంగళవారం శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ,సోదరులు శివ శంకర్ గౌడ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుంచి 30వ తేదీ వరకు పురాణ ప్రవచన కార్యక్రమం ఉంటుందని మరియు ఇందులో భాగంగా ఈ నెల 17న శ్రీ శ్రీ 1008 జగద్గురు డాక్టర్ మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్యులు కాశీ పీఠం వారి అడ్డ పల్లకి మహోత్సవం,18న సంగీతయుక్త ఇష్టలింగ పూజ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.మరియు పురాణ ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.కావున ప్రజలు పురాణ ప్రవచన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాని విజయవంతం చేయాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!