
నేటి నుంచి పురాణ ప్రవచన కార్యక్రమం ప్రారంభం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద శ్రీ సజ్జల గుడ్డద శరణమ్మ అవ్వ పురాణ ప్రవచన కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు రుద్రముని స్వామి పాత్రికేయులకు తెలిపారు.ఈ సందర్భంగా రుద్రముని స్వామి మాట్లాడుతూ గ్రామంలో 7 రోజుల పాటు నిర్వహించే పురాణ ప్రవచన కార్యక్రమాన్ని గ్రామస్థులు,చుట్టూ పక్కల గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఇందులో భాగంగా ఏప్రిల్ 2న డాక్టర్ శ్రీ చన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్యయులు శ్రీశైల పీఠం వారి అడ్డ పల్లకి మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!

