రెవిన్యూ సదస్సుల తాలూకా ప్రత్యేక అధికారి అజయ్ కుమార్.
సమ్మతగేరి గ్రామంలో రెవిన్యూ సదస్సు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో శుక్రవారం సమ్మతగేరి గ్రామంలో సర్పంచ్ శోభ అధ్యక్షతన రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రెవిన్యూ సదస్సుల తాలూకా ప్రత్యేక అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల భూ సమ

స్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రెవిన్యూ సదస్సులను నిర్వహిస్తుందని రైతులు తమ భూమికి సంబంధించిన భూ సమస్యల ఫిర్యాదులను రెవిన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు.మరియు భూ సంబంధిత అనేక సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.అదేవిధంగా రైతుల భూమికి సంబంధించిన మ్యుటేషన్,రీ సర్వే వంటి మొదలైన సమస్యల పై రైతులు అర్జీ సమర్పిస్తే తక్షణమే పరిష్కారం చూపుతామని చెప్పారు.ఈ సమావేశంలో 16 మంది రైతులు భూ సమస్యల పై అర్జీలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్,విఆర్ఓ నాగరాజు,సర్పంచ్ తనయుడు కంరెడ్డి,దేవాదాయ శాఖ అధికారి నాగేంద్ర,ఫారెస్ట్ అధికారులు,గ్రామ సేవకులు,గ్రామస్తులు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!