నెలకిందట తవ్విన రోడ్డు…సరిచేయని వైనం

నెలకిందట తవ్విన రోడ్డు…సరిచేయని వైనం

కేబుల్ వైర్ల పాపం…ప్రజలకు శాపం

ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు

న్యూస్ వెలుగు, కల్లూరు: కర్నూలు నగరం,కృష్ణానగర్ ప్రాంతంలో కేబుల్ వైర్లు మరమ్మత్తుల కోసం ఆయా కంపెనీలు రోడ్డును తవ్వాయి.కానీ పనులు పూర్తిచేసిన తరువాత గుంతలను తాత్కాలికంగా పూడ్చివేశారు.ఈ నేపథ్యంలో వాహనరాకపోకలతో రోడ్డు అస్తవ్యస్తంగా మారింది.దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపిస్తున్నారు.కేబుల్ వైర్ల పాపం…ప్రజలకు శాపంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.తమ పనులు పూర్తికాగానే రోడ్డును నిర్మించాల్సిన బాధ్యతను ప్రభుత్వ యంత్రాంగం విస్మరించడం తగదని చెపుతున్నారు.ఈ మధ్యకాలంలో రోడ్డుపై జరిగిన ఘటనల్లో ఒకరికొకరు తగాదాపడి కొట్టుకున్నట్లు సమాచారం.కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి,తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు,పాదాచారులు కోరుతున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!